Ravi Teja | మరోసారి చిక్కుల్లో రవితేజ సినిమా.. విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా తప్పని తిప్పలు?
Ravi Teja | కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇక ఈయన సినిమాల నుంచి వస్తున్న అప్డేట్స్ ఏ హీరో సినిమాల నుంచి కూడా రావడంలేదు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్రాజ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్‌ను పెట్టాడు. తాజాగా ఈయన నటించిన క్రాక్ సినిమా మరోసారి చిక్కుల్లో పడింది.
చాలా కాలం తర్వాత రవితేజ క్రాక్ వంటి బ్లాక్ బస్టర్‌తో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. కరోనా కారణంగా 50% ఆక్యుపెన్సీతోనే ఈ చిత్రం ప్రీ బిజినెస్‌కు మూడింతల లాభాలను తెచ్చిపెట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి చిక్కుల్లో పడింది. అయితే క్రాక్ చిత్రం కథ తనదేనంటూ శివ సుబ్రమణ్య మూర్తి అనే రచయిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ‘బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ’ అనే పుస్తకంలో సన్నివేశాలను తీసుకుని మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ శివ ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా ఫిలిం చాంబర్ నుంచి నోటీసులు పంపించినా ఎవరూ స్పందించలేదని, దాంతో పోలీసులను ఆశ్రయించానని పేర్కొన్నాడు. గతంలోనూ క్రాక్ సినిమాపై పలు వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. నిర్మాత నుంచి తనకు రావలిసిన అమౌంట్ ఇవ్వలేదని గోపిచంద్ మలినేని ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

