Sankranthi Movies | సంక్రాంతి విన్నర్ ఎవరు.. పండక్కి పండగ చేసుకున్నది ఎవరు..?
Sankranthi Movies | సంక్రాంతికి అనుకున్నది అనుకున్నట్టుగా 4 సినిమాలు విడుదలయ్యాయి. అందులో అన్నింటికంటే ముందుగా జనవరి 11 సాయంత్రం హనుమాన్ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ రూపంలోనే దీనికి అదిరిపోయే టాక్ వచ్చింది.
Sankranthi Movies | చూస్తుండగానే సంక్రాంతి పండుగ వచ్చింది… వెళ్లిపోయింది.. అయితే తనతో పాటు మరో నాలుగు సినిమాలను కూడా తీసుకొచ్చింది ఈ పండుగ. ఈసారి సినిమాల గురించి నెల రోజుల ముందు నుంచే చర్చ జరుగుతూ ఉంది. ఎవరు రేసులో ఉంటారు.. ఎవరు వెనక్కి తగ్గుతారు అనే చర్చ నుంచి.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు దుమ్ము దులిపేస్తారు అనే దగ్గర వరకు ఎన్నో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హనుమాన్ సినిమా గురించి చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. అన్నింటికంటే చిన్న సినిమా కాబట్టి దానికి థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ ఎన్నో కాంట్రవర్సీలు కూడా జరిగాయి.
వీటన్నింటి మధ్య సంక్రాంతికి అనుకున్నది అనుకున్నట్టుగా 4 సినిమాలు విడుదలయ్యాయి. అందులో అన్నింటికంటే ముందుగా జనవరి 11 సాయంత్రం హనుమాన్ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ రూపంలోనే దీనికి అదిరిపోయే టాక్ వచ్చింది. దీనికి ఏకంగా ఇండియన్ వైడ్గా 1000 ప్రీమియర్స్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక తర్వాత రోజు జనవరి 12న గుంటూరు కారం అంటూ మహేశ్ బాబు వచ్చాడు. దీనికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.. ఆ తర్వాత వెంకటేశ్ సైంధవ్.. తర్వాత రోజు నాగార్జున నా సామిరంగా విడుదలయ్యాయి. వీటిలో మరో అనుమానం లేకుండా ఈసారి సంక్రాంతి పండుగ విన్నర్ ఎవరు అంటే.. హనుమాన్ అని చెప్పాల్సిందే.
ఎందుకంటే ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి కనీవిని ఎరుగని రికార్డులకు తెరతీసింది హనుమాన్. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే 3 మిలియన్ దాటేసి టాలీవుడ్ టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదే జోరు కంటిన్యూ అయితే ఫుల్ రన్ లో నాన్ రాజమౌళి, నాన్ ప్రభాస్ రికార్డులన్నింటికీ పెట్టేలా కనిపిస్తోంది హనుమాన్.
మరోవైపు గుంటూరు కారం మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా.. ఆ తర్వాత మెల్లగా పుంజుకుంటుంది. రెండు మూడు రోజుల్లో ఈ సినిమా టాక్ మారిపోయింది. యావరేజ్ నుంచి పాజిటివ్ టాక్ వరకు మారింది. దాంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. థియేటర్స్ ఎలాగూ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది ఈ సినిమా. ప్రస్తుతానికి 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది గుంటూరు కారం. మరో 50 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా సేఫ్ జోన్ కు వస్తుంది. పండగ తర్వాత సినిమాకు వచ్చే కలెక్షన్లు బట్టి గుంటూరు కారం రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.
ఇక వెంకటేశ్ సైంధవ్ మొదటి రోజే రేస్ నుంచి తప్పుకుంది. ఈ సినిమాకు ఊహించిన టాక్ రాలేదు కాబట్టి సంక్రాంతి సినిమాల్లో ఫ్లాప్ రిజల్ట్ అందుకుంది. మరోవైపు నాగార్జున నా సావిరంగా మాత్రం ఊహించినట్టుగానే మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమా తీశాడు దర్శకుడు విజయ్ బిన్ని. నాగార్జున నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా కూడా మరోసారి పండక్కి విజయాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి ఈ సంక్రాంతి విన్నర్ హనుమాన్ అయితే.. ఆ తర్వాత గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

