Abhiram Daggubati | దగ్గుబాటి ఇంట వెడ్డింగ్ బెల్స్.. వార్తల్లో నిజమెంత..?
Abhiram Daggubati | దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు(Ramanaidu) ఇంట వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయనే వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రామానాయుడు పెద్ద కుమారుడు సురేశ్ బాబు ఇప్పటికే లీడింగ్ నిర్మాతగా కొనసాగుతున్నారు.
Abhiram Daggubati | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు(Ramanaidu) ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిసిందే. రామానాయుడు ఇంట వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయనే వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రామానాయుడు పెద్ద కుమారుడు సురేశ్ బాబు ఇప్పటికే లీడింగ్ నిర్మాతగా కొనసాగుతున్నారు. మరోవైపు చిన్నకుమారుడు విక్టరీ వెంకటేశ్ వన్ ఆఫ్ ది స్టార్ యాక్టర్‌గా ఉన్నాడు.
సురేశ్ బాబు పెద్ద కుమారుడు రానా కూడా సిల్వర్ స్క్రీన్‌పై బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రానా సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి సక్సెస్‌ఫుల్‌గా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఈ ఏడాది అహింస సినిమాతో తేజ కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చిన్నకుమారుడు అభిరామ్ (Abhiram Daggubati). తాజాగా ఈ యంగ్ యాక్టర్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు (Wedding)రెడీ అవుతున్నాడనే వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
దగ్గరి బంధువైన అమ్మాయిని అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నాడని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వెడ్డింగ్ బెల్స్ పై దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. అహింస తర్వాత రెండో సినిమా ప్రకటించలేదు అభిరామ్.
ఉందిలే ఉందిలే లిరికల్ వీడియో సాంగ్..
అహింస టీజర్..
అహింస ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

