‘గాడ్‌ఫాదర్-2’ ప్లాన్ చేస్తున్నాం!
చిరంజీవి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్'. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిరంజీవి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. దసరా పర్వదినం సందర్భంగా బుధవారం ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు తన కెరీర్ సంగతులు తెలిపారు దర్శకుడు మోహన్ రాజా.
- నాన్న ఎడిటర్ మోహన్ చిరంజీవి గారితో ‘హిట్లర్’ సినిమా నిర్మించారు. అప్పటి నుంచి మా ఇరు కుటుంబాల మధ్య అనుబంధం ఉంది. ‘ధృవ’ సినిమాలో నటించినప్పుడు రామ్‌చరణ్ నేనూ తరుచూ మాట్లాడుకునేవాళ్లం. మేము కలిసి సినిమా చేయాలనుకున్నాం. ‘గాడ్ ఫాదర్’ సినిమా సన్నాహాలు జరుగుతున్నప్పుడు నిర్మాత ఎన్వీ ప్రసాద్ నన్ను సంప్రదించారు.
- ‘లూసీఫర్’ చూశాక ఆ కథలో కొత్త స్క్రీన్‌ప్లే కోసం ఏ పాయింట్ తీసుకోవచ్చో చిరంజీవి గారికి చెప్పాను. బాగుంది అంటూ ఆయన సినిమా చేయమని ప్రోత్సహించారు. అలా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను చిరంజీవి గారి లాంటి ఇమేజ్ ఉన్న నటుడు మాత్రమే చేయగలరు. ఈ కథా కథనాలు అలాంటివి.
- ఈ సినిమా ప్రధానంగా ఓ పది పాత్రల మధ్య సాగుతుంది. ముఖ్యమంత్రి పీఠం కోసం కొందరు వేసే ఎత్తుకు పై ఎత్తులు ఆసక్తిని కలిగిస్తాయి. వీళ్లందరూ ఆడే ఆటను ఆయనే నడిపిస్తున్నాడు అని తెలియడం ఈ సినిమాలో ట్విస్ట్. ఈ సినిమా కోసం ఎంతో సపోర్ట్ చేశారు మెగాస్టార్. ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నారు.
- ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో చేయాల్సిన అతిథి పాత్ర ఉంది. సల్మాన్‌ఖాన్ ఆ పాత్రను ఆకట్టుకునేలా పోషించారు. అలాగే నయనతార, సునీల్, సముద్రఖని, పూరీ జగన్నాథ్ పాత్రలుంటాయి. ఇమేజ్ లేని ఒక మంచి నటుడు విలన్ జైదేవ్ పాత్రకు ఉండాలని అనుకున్నాం. ఈ పాత్రలో సత్యదేవ్ నటన మెప్పిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి గారి తర్వాత అంత పేరు సత్యదేవ్‌కు వస్తుంది.
- ఇవాళ ప్రేక్షకులు కథ కంటే కథనాన్ని ఇష్టపడుతున్నారు. ‘సీతారామం’ లాంటి స్లో పేస్ స్క్రీన్‌ప్లేతో పాటు ‘విక్రమ్’ లాంటి డిఫరెంట్ స్క్రీన్‌ప్లేను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఏ ఫార్మాట్ అయినా ఆ కథనం ఎంత బాగుంది అనేది చిత్ర విజయాన్ని నిర్ణయిస్తుంది. ‘లూసీఫర్’ కొంత నెమ్మదైన కథనం కాగా ‘గాడ్‌ఫాదర్‌లో’ వేగం కనిపిస్తుంది.
- సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. అన్నీ కుదిరితే ‘గాడ్‌ఫాదర్ -2’ కూడా చేస్తాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

