నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో నవ్విస్తున్నారు అలీ. ఆయన నటించిన కొత్త సినిమా ‘ఎఫ్ 3’.వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, మెహరీన్, తమన్నా నాయికలుగా నటించారు. సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు.
ఈ నెల 27న సినిమా విడుదలవుతున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన పాత్ర విశేషాలను తెలిపారు అలీ. ఆయన మాట్లాడుతూ..ఈ చిత్రంలో బాలబేబి అనే వడ్డీ వ్యాపారి పాత్రలో కనిపిస్తాను. ఆడవాళ్లంటే అతనికి అపారమైన గౌరవం. ఈ క్యారెక్టర్‌లోని ట్విస్ట్ ైక్లెమాక్స్‌లో చూస్తారు. దాదాపు 45 నిమిషాల నిడివి గల పాత్ర నాది. తొలిభాగంలో కొంత ద్వితీయార్థంలో మరికొంత ఉంటుంది. సినిమాలో నాకొక గన్ ఇచ్చారు. అది చాలా బరువుంది. సీన్ చేస్తున్నప్పుడు అది మోయలేకపోయాను.
అందుకే ఈ సినిమాలో నాది బరువైన పాత్ర అని చెబుతున్నా. ‘ఎఫ్ 3’పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా. దిల్ రాజు లాంటి నిర్మాతే ఇలాంటి సినిమా చేయగలరు. దక్షిణాది నటీనటుల విలువేంటో ఇప్పుడు సినీ ప్రపంచానికి తెలిసింది. ఇక మమ్మల్ని ఇండియన్ స్టార్స్ అని పిలవాలేమో. ప్రస్తుతం ‘ఖుషి’, ‘లైగర్’, ‘అంటే సుందరానికీ’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. సినిమాలతో పాటు టీవీ రంగంలోనూ కొనసాగుతాను’అన్నారు.