బెల్లంకొండకు బాలీవుడ్లో పేరొస్తుంది
యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన బాలీవుడ్ సినిమా ‘ఛత్రపతి’. తెలుగు మూవీ ‘ఛత్రపతి’కి హిందీ రీమేక్ ఇది. వీవీ వినాయక్ దర్శకుడు. పెన్ స్టూడియోస్ పతాకంపై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...‘మా అబ్బాయి శ్రీనివాస్‌కు యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది.
యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన బాలీవుడ్ సినిమా ‘ఛత్రపతి’. తెలుగు మూవీ ‘ఛత్రపతి’కి హిందీ రీమేక్ ఇది. వీవీ వినాయక్ దర్శకుడు. పెన్ స్టూడియోస్ పతాకంపై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ…‘మా అబ్బాయి శ్రీనివాస్‌కు యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది.
దాంతో ఈ సబ్జెక్ట్ బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నాం. ఫైట్స్, మదర్ సెంటిమెంట్, శ్రీనివాస్ పర్మార్మెన్స్ ఆకట్టుకుంటాయి. మా అబ్బాయితో బాలీవుడ్ నిర్మాతలు 60 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి హిందీ సినిమా చేయడం గర్వంగా ఉంది. మరో రెండు బాలీవుడ్ చిత్రాలను నిర్మించేందుకు కూడా జయంతి లాల్ గడా ముందుకొచ్చారు’ అని చెప్పారు. దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ…‘ఉత్తరాది ప్రచార కార్యక్రమాల్లో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ ఉన్నారు. అక్కడ ప్రేక్షకుల నుంచి వారికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఒరిజినల్ సినిమాను చెడగొట్టకుండా సాధ్యమైనంత ఆకట్టుకునేలా రూపొందించాలని ప్రయత్నం చేశాను. నటుడిగా శ్రీనివాస్ పరిణితి చెందాడు. ఆయన పర్మార్మెన్స్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పటి పిల్లలకు ‘ఛత్రపతి’ సినిమా తెలియదు. పెద్ద వాళ్లు ఎలా ఉందో చూస్తారని ఆశిస్తున్నాం. బాలీవుడ్లో హీరోగా శ్రీనివాస్ పేరు తెచ్చుకుంటాడు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

