కలర్‌ఫొటో ఫేం డైరెక్టర్ సందీప్ రాజ్ రైటర్‌గా వ్యవహరిస్తున్న తాజా ప్రాజెక్ట్ ముఖచిత్రం (Mukhachitram) . గంగాధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ముఖచిత్రం ట్రైలర్ (Mukhachitram Trailer )ను విడుదల చేశారు.
రాజ్‌కుమార్ అనే ప్లాస్టిక్ సర్జన్ మహతి అనే పల్లెటూరి యువతిని పెళ్లి చేసుకుంటాడు. అంతా సవ్యంగా నడుస్తున్న క్రమంలో మహతి ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. రైటర్ మాయ కూడా ప్రమాదంలో ముఖానికి గాయాలై.. ఆస్పత్రిలో చేరుతుంది. ఆ తర్వాత మహతి పేరుతో రాజ్‌కుమార్‌పై కేసు పెడుతుంది మాయ. ట్విస్టులతో సాగుతున్న ట్రయాంగిల్ స్టోరీతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది ట్రైలర్. ఈ కేసులో ఫైనల్‌గా ఎవరికి శిక్ష పడింది.. ఎవరికి న్యాయం జరిగిందనేది విడుదలయ్యాక క్లారిటీ రానుంది.
ఈ మూవీలో హీరో విశ్వక్సేన్, రవిశంకర్ లాయర్లుగా నటిస్తు్న్నారు. చైతన్య రావ్ మదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. హుషారు ఫేం ప్రియా వడ్లమాని డ్యుయల్ రోల్లో నటిస్తోంది. పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ ఎస్కేఎన్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
ముఖచిత్రం ట్రైలర్..
ట్రైలర్ లాంఛింగ్ ఫొటోలు..
#Mukhachitram Team Addressing Media At #MukhaChitram Trailer Launch @VishwakSenActor @sandeepraaaj @SKNonline @imVdeshK @PriyaVadlamani @vishalbunn @kaalabhairava7 @IamChaitanyarao @DISISDEEEPU @adityamusic pic.twitter.com/kfFmMYTU2r
— BA Raju's Team (@baraju_SuperHit) December 1, 2022
Idhi love story oo.. thriller oo kadhu… anthaku minchi 😉#Mukhachitram hitting hard in theatres from Dec 9th 🔥
▶️https://t.co/ljQA5EM0pV@VishwakSenActor @sandeepraaaj @SKNonline @imVdeshK @PriyaVadlamani @vishalbunn @kaalabhairava7 @IamChaitanyarao @DISISDEEEPU @adityamusic pic.twitter.com/xN9nSW951d
— BA Raju's Team (@baraju_SuperHit) December 1, 2022