అశోకవనంలో అర్జునకళ్యాణం

విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు బి, సుధీర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి విష్వక్సేన్ తల్లిగారైన దుర్గ క్లాప్ నిచ్చారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘టైటిల్ మాదిరిగానే సినిమా కథలో కూడా కొత్తదనం ఉంటుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల కలబోతగా మెప్పిస్తుంది. విష్వక్సేన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన లుక్, పాత్ర చిత్రణ కొత్తశైలిలో కనిపిస్తుంది. త్వరలోనే సెట్స్‌మీదకు తీసుకెళ్తాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి రచన: రవికిరణ్, సమర్పణ: బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకత్వం: విద్యాసాగర్ చింత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

