Gaami | టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో ఒకరు విశ్వక్సేన్ (Vishwaksen). బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన మాస్ కా దాస్ ఇటీవలే లాంగ్ టైం పెండింగ్ ప్రాజెక్ట్ గామి (Gaami)ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడని తెలిసిందే. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా యూనిక్ స్టోరీ టెల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకత్వం వహించాడు.
ఆరేండ్ల క్రితం విశ్వక్సేన్ లీడ్ రోల్లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల మధ్య వాయిదాలు పడుతూ ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.20.3 కోట్లు వసూళ్లు రాబట్టి లాభాల వర్షం కురిపించి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా..? లేదా..? అనే డైలాగ్ అప్లై చేశాడు విశ్వక్సేన్.
థియేటర్లలో అద్బుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లో మిస్సయిన వారి కోసం గామి నేటి నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. గామి ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అఘోరాగా కనిపించగా.. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.
గామి ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీ పెండచంలో కీ రోల్ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రల్లో నటించారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
🔔 Telugu movie #Gaami (2024) now streaming on Zee 5.
Starring – Vishwak Sen, Ramya Pasupileti, Chandini Chowdary, Mohamed Samed, Abhinaya & Mayank Parak.
Available in – Telugu (Original), Tamil & Kannada. pic.twitter.com/hlmTXfAL7C
— Ott Updates (@Ott_updates) April 12, 2024
గామి ట్రైలర్..
గామి మేకింగ్ వీడియో..
A man’s journey through the impossible and the unknown to conquer his fear 🧿#Gaami GRAND RELEASE WORLDWIDE ON MARCH 8th ❤️🔥
Watch the making video now!
– https://t.co/5NMBYrPTa7Get ready for a NEW EXPERIENCE only on the BIG SCREENS ✨@VishwakSenActor @iChandiniC… pic.twitter.com/eVavPeNGBH
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..