Dhamki Trailer 2.0 | డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ.. డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దు.. ధమ్ కీ ట్రైలర్ 2.0
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న మూవీ ధమ్కీ (Dhamki). మేకర్స్ ధమ్ కీ ట్రైలర్ 2.0 (Dhamki Trailer 2.0)ను లాంఛ్ చేశారు. ఫార్మా రంగం చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమ్కీ (Dhamki). విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధమ్ కీ ట్రైలర్ 2.0 (Dhamki Trailer 2.0)ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఫార్మా రంగం చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు. డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ.. డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దు.. అని విశ్వక్ సేన్ చెబుతున్న డైలాగ్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయి.
ధమ్కీ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ధమ్కీలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు.
ధమ్కీ ట్రైలర్..
#DasKaDhamki TRAILER 2.0 is out now🔥
– https://t.co/vHtuzHE99z@VishwakSenActor @Nivetha_Tweets pic.twitter.com/s5V8oqRGiJ
— BA Raju's Team (@baraju_SuperHit) March 12, 2023
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ తెలుగు లిరికల్ వీడియో
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ హిందీ లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

