Mark Antony | సింగర్‌గా విశాల్.. మార్క్ ఆంటోనీ నయా అప్డేట్ అదిరింది
Mark Antony | విశాల్ (Vishal) నటిస్తోన్న చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Mark Antony | తెలుగు, తమిళం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ విశాల్ (Vishal). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రంతో ప్లే బ్యాక్ సింగర్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశాల్.
తాజా అప్డేట్ ప్రకారం గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న మార్క్ ఆంటోనీలో ఎనర్జిటిక్ మాస్ నంబర్ అదరదా మామా సాంగ్ పాడాడు విశాల్. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను జులై 15న లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు యాక్టర్ అయిన విశాల్ చెన్నైలో సెటిలై.. ఎక్కువగా తమిళ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్స్‌తోపాటు టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
మార్క్ ఆంటోనీ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. విశాల్ టీం ఇప్పటికేమార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్ తో సునీల్, ఎజేసూర్య, సెల్వ రాఘవన్ పాత్రలను పరిచయం చేస్తూ.. సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.
మార్క్ ఆంటోనీ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశాల్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. అంతేకాకుండా విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు విశాల్.
Sir…once again..u sound fabulous..
Like pro..💕👍 Thanks for d trust💕 https://t.co/Fmx7MQ4rsN— RamajogaiahSastry (@ramjowrites) July 13, 2023
#WorldOfMarkAntony https://t.co/xy0Xwzop3e
— Vishal (@VishalKOfficial) July 14, 2023
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

