Mark Antony | డిజిటల్ ప్లాట్‌ఫాంలో విశాల్ మార్క్ ఆంటోనీ.. ఎన్ని భాషల్లోనో తెలుసా!
Mark Antony | కోలీవుడ్ హీరో విశాల్ (Vishal) టైటిల్ రోల్ పోషించిన చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించి.. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
Mark Antony | కోలీవుడ్ హీరో విశాల్ (Vishal) టైటిల్ రోల్ పోషించిన చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించి.. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
కాగా థియేటర్లలో మిస్సయిన వారి కోసం మార్క్ ఆంటోనీ డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మార్క్ ఆంటోనీ అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్క్ ఆంటోనీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే మార్క్ ఆంటోనీ ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ విడుదలపై మాత్రం మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్స్‌తోపాటు టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతీ ఒక్కటి సినిమాపై అంచనాలు పెంచడంలో కీ రోల్ పోషించాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మార్క్ ఆంటోనీలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. సెల్వరాఘవన్, వైజీ మహేంద్రన్, అభినయ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ మూవీని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ తెరకెక్కించారు. విశాల్ మరోవైపు హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ ఫిల్మ్ తుప్పరివాలన్ 2 చేస్తున్నాడు. దీంతోపాటు విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Mark Antony1
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
మార్క్ ఆంటోనీ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

