Mark Antony | టాలెంటెడ్ హీరో విశాల్ (Vishal) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విశాల్ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా మార్క్ ఆంటోనీ సెన్సార్ అప్డేట్ వచ్చింది.
ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం మార్క్ ఆంటోనీ రన్‌టైం 150 నిమిషాలు (2 గంటల 30 నిమిషాలు). మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్స్‌తోపాటు టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. మార్క్ ఆంటోనీలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సెల్వరాఘవన్, వైజీ మహేంద్రన్, అభినయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన I Love U Ne సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మార్క్ ఆంటోనీ మూవీని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఓ నటుడిగా నాకు నెక్ట్స్ లెవల్ సినిమా ఇది. ఇందులో రెండు డిఫరెంట్ రోల్స్ చేశానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు విశాల్. విశాల్ మరోవైపు హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ ఫిల్మ్ తుప్పరివాలన్ 2 చేస్తున్నాడు. దీంతోపాటు విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
మార్క్ ఆంటోనీ ట్రైలర్..