Vikram Movie | వంద రోజులు పూర్తి చేసుకున్న ‘విక్రమ్’ మూవీ.. కమల్ ట్వీట్ వైరల్
Vikram Movie Completes 100days | విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీహిట్గా నిలిచింది. విడుదలైన అన్ని ఏరియాల్లో డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చాలా కాలం తర్వాత కమల్‌కు విక్రమ్ సినిమా భారీ విజయం సాధించింది. ఇక దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి.
తాజాగా ఈ చిత్రం 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా రెండు వారాలు అడుతుందంటేనే పెద్ద విషయం. అలాంటిది విక్రమ్ 100రోజులు పూర్తి చేసుకొని తమిళ నాడులో ఇంకా రెండు మూడు థియేటర్లలో ప్రదిర్శితం అవతుందంటే విశేషం అనే చెప్పాలి. వంద రోజులు పూర్తయిన క్రమంలో కమల్ ఓ వాయిస్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. తెలుగులో ఈ చిత్రానికి దాదాపు రూ.18 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. దీంతో విక్రమ్ సినిమాకు తెలుగులో రూ.10కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చాయి. హీరో నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేశాడు.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
#100DaysofVikram #VikramRoaringSuccess pic.twitter.com/7SjZIpTB6M
— Kamal Haasan (@ikamalhaasan) September 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

