Vikram | చెన్నైలో అరుదైన మార్క్ క్రాస్ చేసిన విక్రమ్
విక్రమ్ (Vikram)..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేశాడు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. తొలి రోజు నుంచి ఇప్పటికే విక్రమ్ ఏదో ఒక అరుదైన మైల్ స్టోన్‌ను చేరుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ చేసిన చిత్రం విక్రమ్ (Vikram). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేశాడు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. తొలి రోజు నుంచి ఇప్పటికే విక్రమ్ ఏదో ఒక అరుదైన మైల్ స్టోన్‌ను చేరుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తమిళనాడు బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీ వసూళ్లపరంగా ఒక్క చెన్నై సిటీలోనే రూ.15 కోట్లు దాటేసిందట. చెన్నైలో ఇప్పటివరకు హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా విక్రమ్ నిలిచిందని కోలీవుడ్ సర్కిల్ టాక్. తెలుగులో కూడా విక్రమ్ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. రీసెంట్గా బాహుబలి 2 రికార్డు (తమిళ వెర్షన్ ఐదేళ్ల రికార్డు)ను బ్రేక్ చేసి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది విక్రమ్ సినిమా.
ఈ చిత్రం జులై 8న 2022 ఓటీటీ ప్లామ్ ఫాంలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌గా వచ్చిన విక్రమ్‌ను రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ , సూర్య కీ రోల్స్‌లో నటించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

