Rajamouli | రాజమౌళి స్ఫూర్తితో సినిమా తీశాం.. తమిళ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది.
Rajamouli | దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘GOAT’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ ‘నేను దర్శకుడు రాజమౌళిగారికి పెద్ద అభిమానిని. ఈ సినిమా చేయడానికి ఆయనే స్ఫూర్తినిచ్చారు. ఇదొక హోల్సమ్ ఎంటర్టైనర్. హీరో విజయ్ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు.
‘పుష్ప’ వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తమిళ నిర్మాత అర్చన కల్పాతి పేర్కొన్నారు. అద్భుతమైన విజన్‌తో దర్శకుడు వెంకట్‌ప్రభు ఈ చిత్రాన్ని తీశాడని నటుడు ప్రశాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయికలు మీనాక్షి చౌదరి, స్నేహ, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

