ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమా.. సెప్టెంబర్ 17న విడుదల
విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న 'అనబెల్ & సేతుపతి' సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ పెద్ద సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తెలుగులోనే కాదు తమిళంలో కూడా నిర్మాతలు పెద్ద సినిమాలను డిజిటల్ మీడియా వేదికగా విడుదల చేస్తున్నారు. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న ‘అనబెల్ & సేతుపతి’ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో నేరుగా విడుదల కానుంది ‘అనబెల్ & సేతుపతి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి, తాప్సీ మొహాలను బాగా హైలెట్ చేశారు. వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ చేశారు. పోస్టర్‌ను రివర్స్ చేసి చూస్తే సినిమాలో నటించిన మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు. పోస్టర్లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 9న మరో సినిమాతో వస్తున్నాడు విజయ్ సేతుపతి. స్వీయ నిర్మాణంలో రూపొందించిన లాభం సినిమా థియేటర్లలో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా వచ్చిన సరిగ్గా వారం రోజుల తర్వాత మరో సినిమాతో ఓటీటీలో దర్శనమిస్తున్నాడు విజయ్ సేతుపతి. అలా రెండు వారాల్లో రెండు సినిమాలతో వస్తున్నాడు ఈ హీరో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్
దిశా పటానీ బీచ్‌వాక్.. ఇన్‌స్టాలో కొత్త వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

