Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రత్యేక చొరవతో ఓ దివ్యాంగ యువకుడి జీవితంలో వెలుగులు నింపారు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలంటూ సైగల ద్వారా విజ్ఞప్తి చేసిన యువకుడికి కేవలం 24 గంటల్లోనే ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే నియామక పత్రం చేతికి అందడంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రత్యేక చొరవతో ఓ దివ్యాంగ యువకుడి జీవితంలో వెలుగులు నింపారు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలంటూ సైగల ద్వారా విజ్ఞప్తి చేసిన యువకుడికి కేవలం 24 గంటల్లోనే ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే నియామక పత్రం చేతికి అందడంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.చెన్నైలోని గిండిలో ఉన్న ప్రభుత్వ వృత్తివిద్యా శిక్షణ సంస్థలో బుధవారం ఉదయం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయ్ హాజరయ్యారు. అదే సమయంలో దినేశ్ అనే దివ్యాంగ యువకుడు ఆయన వద్దకు వెళ్లి చిన్న కాగితాన్ని అందించాడు. తాను నిరుద్యోగినని, జీవనం సాగించడం కష్టంగా ఉందని, ఏదైనా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని అందులో విజ్ఞప్తి చేశాడు. తన పరిస్థితిని సైగల ద్వారా కూడా ముఖ్యమంత్రికి వివరించాడు.
దినేశ్ చెప్పిన విషయాలను శ్రద్ధగా అర్థం చేసుకున్న విజయ్ అతడికి తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. యువకుడు అందించిన కాగితాన్ని తన కోటు జేబులో పెట్టుకుని అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లారు. సాధారణంగా కార్యక్రమాల్లో ఎంతోమంది తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తుంటారు. అయితే దినేశ్ విజ్ఞప్తిపై విజయ్ వెంటనే స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం జరిగిన ఈ ఘటన తర్వాత గురువారం ఉదయం దినేశ్‌కు ముఖ్యమంత్రిని కలవాలంటూ సచివాలయం నుంచి సమాచారం అందింది. దీంతో అతడు అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ స్వయంగా దినేశ్‌తో కరచాలనం చేసి, ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.
తిరువొత్తియూరులోని ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో సహాయకుడి పోస్టుకు దినేశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసిన ఒక్క రోజులోనే నియామక పత్రం అందడంతో దినేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కష్టాన్ని అర్థం చేసుకుని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి విజయ్‌కు దినేశ్ కృతజ్ఞతలు తెలిపాడు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న ఓ దివ్యాంగ యువకుడికి తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించిన ఈ ఘటన పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. సైగలతో చేసిన విజ్ఞప్తిని అర్థం చేసుకుని, ఇచ్చిన హామీని మరుసటి రోజే నిలబెట్టుకోవడం విజయ్ స్పందనలోని ప్రత్యేకతగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

