GOAT Movie | విజయ్ ‘గోట్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
GOAT Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
GOAT Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక శనివారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ విడుదల చేయగా యాక్షన్ ప్యాక్డ్గా ఉన్న ఈ గ్లింప్స్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుండగా తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ చిన్నచిన్నకంగాళ్ అనే సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషనల్‌గా సాగిన ఈ పాటను విజయ్‌తో పాటు యువన్ శంకర్ రాజా, రాజా భవతరిని కలిసి పాడారు. కబిలన్ వైరముత్తు సాహిత్యం అందించిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
ఇక ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరుపుకుంటుంది. రష్యాలో విజయపై యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మీనాక్షి చౌదరి, వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

