Liger Movie | విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ‘లైగర్’ సినిమా
Liger Movie Advance Bookings | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. దాదాపు రెండేళ్ళ తర్వాత విజయ్ సినిమా రావడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుండి సంబురాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది.
‘లైగర్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డు క్రియేట్ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 3కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ఈ స్థాయిలో ఉంటే మొదటి రోజు ఖచ్చితంగా డబుల్ డిజిట్ వసూళ్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.85కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరీ ఈ చిత్రంతో విజయ్ 100కోట్ల షేర్‌ను సాధించిన హీరోల లిస్ట్‌లో చేరుతాడో లేదో చూడాలి.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్‌జోహర్, ఛార్మీలతో కలిసి పూరీ జగన్నాధ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. అనన్య పాండే హీరోయిన్గా నటించించిన ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రంపై బాలీవుడ్లో బైకాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఐ సపోర్ట్ లైగర్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

