Liger Movie | ‘లైగర్’ రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్..!
Liger Movie Romantic video song | విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘లైగర్’. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ప్లాప్‌గా మిగిలింది. మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా రెండవ రోజు నుండి థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్లను కూడా సాధించలేకపోయింది. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో ఈ సినిమా ప్లేస్‌లో కార్తికేయ-2ను రిప్లేస్ చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్‌ను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.64 కోట్లను సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు, ఇప్పడున్న థియేటర్ పర్ఫార్మెన్స్కి బ్రేక్ ఈవెన్ కష్టమే అనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో విజయ్ యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. లైగర్ పాత్ర కోసం విజయ్ పెట్టిన ఎఫర్ట్స్ స్క్రీన్‌పైన కనిస్తాయి.
ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ చిత్రంలోని ‘కలలో కూడా’ అంటూ సాగే మెలోడియస్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. విజయ్, అనన్య పాండే కెమిస్ట్రీ బాగా కుదిరింది. తనిష్క్ బాగ్చీ స్వర పరిచిన ఈ పాటను భాస్కరభట్ల రచించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఛార్మీ, పూరీ జగన్నాధ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించగా, రమ్యకృష్ణ విజయ్‌కు తల్లిగా నటించింది. ఇక హిందీలో ఈ చిత్రం రూ.6.75 కోట్ల షేర్‌ను సాధించింది. బాలీవుడ్లో ఈ చిత్రానికి 10.5 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే మరో రూ.3.75 కోట్లు సాధించాల్సి ఉంది. అయితే హిందీలో ఈ చిత్రం బ్రేక్ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

