హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ‘వంద దేవుళ్లు’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో మంచు విష్ణు సోషల్‌మీడియా ద్వారా ఆవిష్కరించారు.
రైతు సమస్యలు చుట్టూ ఈ కథ నడుస్తుందని, విజయ్ ఆంటోని రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తారని, బలమైన సామాజిక సందేశం మేళవించిన చిత్రమిదని మేకర్స్ తెలిపారు. స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బాలాజీ శ్రీరామ్, నిర్మాత: రామంజనేయులు జవ్వాజి, సమర్పణ: ఫాతిమా విజయ్ ఆంటోని, దర్శకత్వం: శశి.