Vihari OTT | తెలుగు తొలి ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ‘విహారి’: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
Vihari OTT | తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా తెలుగులోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘విహారి’ గ్లోబల్ విజన్‌ను ఘనంగా ఆవిష్కరించారు.
Vihari OTT | తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా తెలుగులోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘విహారి’ గ్లోబల్ విజన్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ‘బిగ్ బాస్’ ఫేమ్, ప్రముఖ నటి శ్రీ సత్య చేతుల మీదుగా ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రివ్యూను విడుదల చేశారు. ఈ సరికొత్త డిజిటల్ లైనప్ జూన్ నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
గడిచిన 18 ఏళ్లుగా టెలివిజన్ మాధ్యమంలో అద్భుతమైన ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, పర్యాటక రంగంలో విహారి తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు మరియు స్థానిక వంటకాల విశేషాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంలో విహారి ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు అదే నమ్మకంతో, మరింత విస్తృతమైన కంటెంట్‌తో సరికొత్త గ్లోబల్ ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెందింది.
టెలివిజన్ రంగంలో ఎన్నో విజయవంతమైన ప్రయాణ కథనాలను అందించిన విహారి, డిజిటల్ విప్లవానికి అనుగుణంగా ఇప్పుడు OTT రూపంలో సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. తెలుగు భాషలో కేవలం పర్యాటకం, ప్రయాణాలకు మాత్రమే అంకితమైన మొట్టమొదటి OTT ప్లాట్‌ఫామ్‌గా ‘విహారి OTT’ చరిత్ర సృష్టించబోతోంది. జూన్ నెలలో ఈ ప్లాట్‌ఫామ్ గ్రాండ్‌గా లాంచ్ కానుండటంతో, ప్రపంచాన్ని తమ ఇంట్లోనే కూర్చొని వీక్షించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

