Vignesh Shivan | ‘నా కలలను ముక్కలు చేశారు’.. ‘ఎల్ఐకే’ ఫ్లాప్‌పై దర్శకుడు విఘ్నేశ్ శివన్ భావోద్వేగ వ్యాఖ్యలు
Vignesh Shivan | సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, నెగెటివ్ ప్రచారం ఒక దర్శకుడి కలలపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తాజాగా వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎల్ఐకే’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ పరాజయంపై సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించారు
Vignesh Shivan | సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, నెగెటివ్ ప్రచారం ఒక దర్శకుడి కలలపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తాజాగా వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎల్ఐకే’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ పరాజయంపై సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించారు.తన సినిమాపై ఉద్దేశపూర్వకంగా జరిగిన నెగెటివ్ ప్రచారం కారణంగా ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూడకుండా మిస్ అయ్యారని విఘ్నేశ్ శివన్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన తర్వాత తనకు వచ్చిన అనేక సందేశాల్లో, నెగెటివ్ రివ్యూలు చూసి థియేటర్‌కు వెళ్లలేదు, ఇప్పుడు చూసిన తర్వాత మంచి సినిమా మిస్ అయ్యామని అనిపిస్తోంది అని పలువురు పేర్కొన్నారని చెప్పారు.
ఒక సినిమాను తెరకెక్కించడం వెనుక ఎన్నో సంవత్సరాల శ్రమ, వందల మంది కష్టాలు, నిర్మాతల పెట్టుబడులు, కళాకారుల అంకితభావం ఉంటాయని ఆయన గుర్తుచేశారు. అలాంటి సినిమాను కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, ప్రతికూల ప్రచారం ప్రభావితం చేయడం బాధాకరమని అన్నారు. ముఖ్యంగా పెద్ద స్టార్ మద్దతు లేదా భారీ బ్యాకప్ లేని సినిమాలకు ఇలాంటి ప్రచారం మరింత నష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాకు ప్రారంభ రోజుల్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నారు. ఆ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని, ఆ నిరాశ నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నానని తెలిపారు. ఒక దర్శకుడిగా సినిమా కోసం చేసిన కష్టం గుర్తుకు వస్తే ఇంకా బాధ కలుగుతోందని చెప్పారు.
సినిమా పరిశ్రమలో ఎన్నో క్లాసిక్ చిత్రాలు విడుదల సమయంలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, కాలక్రమంలో గొప్ప చిత్రాలుగా గుర్తింపు పొందిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అదే ఆశతో తాను కూడా ముందుకు సాగుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ‘ఎల్ఐకే’ చిత్రానికి దక్కాల్సిన ఆదరణ ఇంకా పూర్తిగా దక్కలేదని, భవిష్యత్తులో ప్రేక్షకులు ఈ సినిమాను మరో కోణంలో చూసి ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.విఘ్నేశ్ శివన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న ఈ సమయంలో, ఒక సినిమా విజయాపజయాలపై ఆన్లైన్ ప్రచారం ఎంత ప్రభావం చూపుతుందనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. దర్శకుడి భావోద్వేగ పోస్ట్‌కు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

