IB71 Movie | ఉత్కంఠ భరితంగా ‘IB71’ ట్రైలర్.. ఘాజీ దర్శకుడికి మరో హిట్టు పడేలా ఉందిగా..!
IB71 Movie tariler | ఆరేళ్ళ క్రితం వచ్చిన 'ది ఘాజీ ఎటాక్' సినిమాతో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. తొలి సినిమాకే నేషనల్ అవార్డు గెలుచుకుని తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో సంకల్ప్ టేకింగ్, విజన్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.
IB71 Movie tariler | ఆరేళ్ళ క్రితం వచ్చిన ‘ది ఘాజీ ఎటాక్’ సినిమాతో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. తొలి సినిమాకే నేషనల్ అవార్డు గెలుచుకుని తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో సంకల్ప్ టేకింగ్, విజన్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా అండర్ వాటర్‌లో సబ్మేరియన్ సీన్స్ అయితే వేరే లెవల్లో తెరకెక్కించాడు. ఇక రెండో సినిమా ఏకంగా అంతరిక్షంపైనే తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సంకల్ప్ నుంచి మరో సినిమా రాలేదు. కాగా దాదాపు ఏదేళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ‘IB71’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
తుపాకీ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. యాభై ఏళ్ల పాటు అత్యంత రహస్యంగా ఉంచిన ఇండియాస్ టాప్ సీక్రెట్ మిషన్ ‘IB71’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని స్పష్టం చేశారు. 30 మంది ఏజెంట్లు 10 రోజుల పాటు చేపట్టిన అత్యంత రహస్య మిషన్ గురించి ఈ సినిమాలో చర్చించ బోతున్నారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి IB ఏజెంట్ దేవ్ జమ్వాల్ (విద్యుత్ జమ్వాల్) ఎలాంటి సాహాసాలు చేశాడు అనేది ట్రైలర్లో చూపించారు.
ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను టీ సిరీస్, రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలతో కలిసి విద్యుత్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరీ ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ రిలీజవుతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

