Venu Udugula | మంగ్లీ కేసులో తన పేరు ఎందుకు చేర్చారు…ఆవేదన వ్యక్తం చేసిన దర్శకుడు వేణు ఊడుగుల
Venu Udugula | సింగర్ మంగ్లీపై నమోదైన కేసు వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వినిపించడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ విషయంపై వేణు ఊడుగుల స్పందిస్తూ తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Venu Udugula | సింగర్ మంగ్లీపై నమోదైన కేసు వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వినిపించడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ విషయంపై వేణు ఊడుగుల స్పందిస్తూ తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన వేణు ఊడుగుల, మంగ్లీ కేసుతో నా పేరును లింక్ చేస్తూ వచ్చిన వార్తలు చూసి బాధపడ్డాను. ఆ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ, అలాగే ఫిర్యాదు చేసిన లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు పరిచయం ఉన్నవారే. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మాత్రమే సూచించాను అని తెలిపారు.
ఈ కేసులో ఎక్కడా నా పేరు నిందితుడిగా లేదు. అలాగే ఫిర్యాదు చేసిన లాయర్ కూడా మీడియా ముందే నాకు సంబంధం లేదని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా నా పేరును ప్రచారం చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ వివాదం మొదట లాయర్ సుబ్బారావు ఫిర్యాదుతో మొదలైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట సుమారు రూ.10 కోట్ల మేర మోసం జరిగిందని తనకు సమాచారం వచ్చిందని, ఈ విషయంపై మాట్లాడేందుకు మంగ్లీని సంప్రదించగా ఆమె అవమానకరంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా డబ్బులు ఆఫర్ చేసి, అంగీకరించకపోతే బెదిరింపులకు దిగారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరియు మరికొందరిపై కేసు నమోదైంది.
ఇక మరోవైపు మంగ్లీ కూడా లాయర్ సుబ్బారావుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమతో అమర్యాదగా ప్రవర్తించారని, తనను కలవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. తనను అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించడంతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. ఇరు వైపులా కేసులు నమోదు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో వేణు ఊడుగుల పేరు వినిపించడంతో వచ్చిన గందరగోళానికి ఆయన ఇచ్చిన క్లారిటీతో కొంత వరకు వివాదం చల్లారే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మంగ్లీ కేసు ఇంకా అనేక మలుపులు తిరుగుతుండగా, ఈ వ్యవహారం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

