కజకిస్థాన్‌లో భారీ యాక్షన్
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలు.
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజాగా కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్ రియల్ సతీశ్ పర్యవేక్షణలో గురువారం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ పాల్గొన్నారు.
కజకిస్థాన్ ప్రకృతి నేపథ్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని భారీస్థాయిలో రూపొందించారు. అలాగే ఈ షెడ్యూల్లోనే హీరోలిద్దరిపై రెండు ప్రధాన సన్నివేశాలను, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాటను కూడా చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో కజకిస్థాన్ పర్వతాల నేపథ్యంలో ఉత్సాహంగా కనిపిస్తున్న వెంకటేశ్, కల్యాణ్‌రామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడిలను చూడొచ్చు. సంక్రాతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

