వెంకీ, వరుణ్లతో హ్యాట్రిక్
‘ఎఫ్ 3’ చిత్రాన్ని క్లాస్, మాస్, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చిందని చెబుతున్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమా విజయోత్సవాన్ని హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ..‘ పాండమిక్లో యూత్, మాస్ మాత్రమే థియేటర్లకు వచ్చేవారు. మేం కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతో సినిమా చేశాం. ఇవాళ మా అంచనా నిజమైంది’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘ఉదయం నుంచీ సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తున్నది. వెంకటేష్, వరుణ్ తేజ్లతో మా సంస్థకు హ్యాట్రిక్ విజయం దక్కింది. ఓవర్సీస్ నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది’ అన్నారు. ‘చిత్రబృందం అంతా రెండేళ్లు ఒక కుటుంబంలా కలిసి పనిచేశాం. ఇమేజ్ ఉన్న హీరోలతో కామెడీ పండించడం సంతోషంగా ఉంది’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

