జీవితాంతం అదే పంథాలో కొనసాగుతా
విధిని బలంగా విశ్వసిస్తారు అగ్ర హీరో వెంకటేష్. ఏ రంగంలో ఉన్నా నిజాయితీగా పనిచేయాలని, ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించొద్దని చెబుతుంటారు. ఆయనతో ఇంటర్వ్యూ అంటే ఆద్యంతం సరదాగా, అక్కడక్కడా ఆధ్యాత్మిక అంశాల చర్చతో సాగిపోతుంది.
విధిని బలంగా విశ్వసిస్తారు అగ్ర హీరో వెంకటేష్. ఏ రంగంలో ఉన్నా నిజాయితీగా పనిచేయాలని, ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించొద్దని చెబుతుంటారు. ఆయనతో ఇంటర్వ్యూ అంటే ఆద్యంతం సరదాగా, అక్కడక్కడా ఆధ్యాత్మిక అంశాల చర్చతో సాగిపోతుంది. ఆయన నటించిన 75వ చిత్రం ‘సైంధవ్’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. శైలేష్ కొలను దర్శకుడు. ఈ సందర్భంగా గురువారం వెంకటేష్ పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి..
- నా దృష్టిలో 75 అనేది ఓ నెంబర్ మాత్రమే. అందుకే ఈ సినిమా విషయంలో ఏమాత్రం ఒత్తిడిగా ఫీలవలేదు. ఆ సమయానికి మన వద్దకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని నిజాయితీగా కష్టపడాలన్నదే నా తత్వం. ప్రతీ సినిమా నాకు ప్రత్యేకమే. కెరీర్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
- ‘సైంధవ్’ కథలో మనసును కదిలించే డాటర్ సెంటిమెంట్ ఉంటుంది. తండ్రీ కూతురు అనుబంధం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. యాక్షన్ ఘట్టాలు చాలా సహజంగా అనిపిస్తాయి. రేసీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతుంది. ఇప్పటివరకు ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో నేను సినిమా చేయలేదు.
- ఈ సినిమా ైక్లెమాక్స్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. పతాక ఘట్టాల్లో వచ్చే సన్నివేశాలన్నీ ఉద్వేగాల్ని పంచుతాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. ఈ అంశాలన్నీ సినిమాకు ఓ కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.
- ‘ధర్మచక్రం’ సినిమాతో ‘సైంధవ్’కు ఎలాంటి పోలిక ఉండదు. రెండూ పూర్తి విభిన్నమైన చిత్రాలు. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆయన విలక్షణ నటుడు. ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచాడు.
- ఈ సినిమా కోసం దర్శకుడు శైలేష్ ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ సిటీని సృష్టించాడు. మాఫియా, డ్రగ్స్, గన్ కల్చర్ కలబోతగా ఆ నగర సెటప్ మొత్తం హాలీవుడ్ సినిమా తరహాలో ఉంటుంది. ఇక సంతోష్ నారాయణ సందర్భోచితంగా చక్కటి పాటలిచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథలోని ఫీల్‌ను క్యారీ చేస్తుంది.
- 75 సినిమాల ప్రయాణంలో ఎక్కడా ఒక్క వివాదం లేకుండా ఎలా ఉన్నారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నిజంగా ఆ విషయం నాకు తెలియదు (నవ్వుతూ). చిన్నతనం నుంచే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, అసౌకర్యం కలిగించకుండా ఉండాలనే మనస్తత్వం నాది. జీవితాంతం అదే పంథాలో సాగుతాను.
- ‘స్వామి వివేకానంద’ స్క్రిప్ట్ ఓ లెవల్ వరకు వచ్చింది. ఇద్దరు మేకర్స్ చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ ఇంకా పూర్తి సంతృప్తిగా రాలేదు. నా తదుపరి సినిమా ఇంకా ఖరారు కాలేదు. రెండు మూడు కథలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

