SAINDHAV | మూవీ లవర్స్ గెట్ రెడీ.. మరో భాషలో వెంకటేశ్ సైంధవ్
SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) టైటిల్ రోల్లో నటించిన చిత్రం సైంధవ్ (SAINDHAV). ఈ ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) టైటిల్ రోల్లో నటించిన చిత్రం సైంధవ్ (SAINDHAV). వెంకటేశ్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీకి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ వెంకీ అభిమానులను నిరాశపర్చింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా పలు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇక తాజాగా మరో భాషలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు సైంధవ. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో సినిమాలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది సైంధవ్. అంతేకాదు సైంధవ్ హిందీ వెర్షన్ కలర్స్ సినీప్లెక్స్ ఛానల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. మరి ఉత్తరాది ప్రేక్షకులు సైంధవ్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సి ఉంది.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో, కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.
From 😇 to 😈 real quick! #3DaysToWitnessSaindhav
23rd June raat 8 baje, dekhiye #Saindhav ka World Premiere, sirf Colors Cineplex aur @JioCinema par.#SaindhavOnColorsCineplex #SaindhavOnJioCinema #DubbedMovie #WorldPremiere #ColorsCineplex pic.twitter.com/sbXC8SfxdG
— Colors Cineplex (@Colors_Cineplex) June 21, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

