నిజాయతీగా చేసిన ప్రయత్నం
వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్రం
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ
(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనిధిశెట్టి కథానాయిక. శుక్రవారం సాయంత్రం బ్లాక్‌బస్టర్
సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న
ప్రేక్షకులందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ఇదొక కొత్త జోనర్. టీమంతా నిజాయతీగా పనిచేశాం. ఉదయం నుంచి అభినందనలు తెలియజేస్తూ నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి సినిమాలు ఇవ్వాలని నేను ఎప్పుడూ నిజాయతీగా ప్రయత్నిస్తుంటాను’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఇది ప్రేక్షకులు మాట్లాడాల్సిన సమయం. వారు మాట్లాడితే మనం వినాలి. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీడియా మిత్రులు చాలా మంది ఫోన్లు చేసి అభినందించారు.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందన్నారు’ అని పేర్కొన్నారు. కథానాయిక శ్రీనిధి శెట్టి
మాట్లాడుతూ ‘ఈరోజు థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశా. ప్రతి సన్నివేశానికి వారు క్లాప్స్ కొడుతూ
ఎంజాయ్ చేస్తున్నారు. నేను పోషించిన స్వర్ణ పాత్ర కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మంచి
హాస్యంతో పాటు భావోద్వేగాలతో దర్శకుడు త్రివిక్రమ్ నా పాత్రను తీర్చిదిద్దాడు’ అని చెప్పింది. త్రివిక్రమ్‌తో
చాలా సినిమాలకు పనిచేశానని, ఆయన రామాయణంను తెరకెక్కిస్తే చూడాలన్నది తన అభిమతమని
సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

