అఖండ సినిమాతో ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈసారి వీరసింహారెడ్డి (Veera Simha Reddy)గా మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. స్టార్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్లో రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రం నందమూరి అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తోంది.
జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన వీరసింహారెడ్డి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకు సంబంధించిన అధికారిక అప్డేట్ అందించింది మైత్రీ మూవీ మేకర్స్ టీం. బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత.. వీరమాస్ బ్లాక్ బస్టర్ తొలి రోజు రూ.54 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని తెలియజేశారు.
మరి రాబోయే రోజుల్లో బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.ఈ చిత్రంలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా కన్నడ యాక్టర్ దునియా విజయ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచేలా సాగుతుంది. ఈ మూవీలో హనీ రోజ్, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫస్ట్ డే కలెక్షన్లపై మేకర్స్ ట్వీట్..
బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత 🔥🔥
VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses Massive 54 CR on Day 1 🔥
Book your tickets now!
– https://t.co/SzgoK7HjZVNatasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/PrfB4kckhX
— Mythri Movie Makers (@MythriOfficial) January 13, 2023
వీరసింహారెడ్డి మేకింగ్ స్టిల్స్..
Making Stills from #VeeraSimhaReddy with the GOD OF MASSES 🔥
Here are the #FramesOfVeeraSimhaReddy 💥
Mass Jaathara in Theatres from JAN 12 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/blb7QgpBYc
— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
వీరసింహారెడ్డి టీజర్..
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..