నాటు నాటు… ప్రపంచవ్యాప్తంగా ఇప్పడు దీనిగురించే మాట్లాడుకుంటున్నారు. ఏ టీవీ చూసినా నాటు నాటే.. పేపర్లు, సోషల్ మీడియా ఇలా ప్రతీ చోట నాటు నాటు పాట మారుమోగుతున్నది. ఈ పాట డాన్సు గురించే చర్చంతా. ఎందుకో అందరికీ తెలిసిందే. నాటు నాటు పాటకు అస్కార్ అవార్డు వచ్చినందుకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు విష్ చేశారు. కానీ.. వీణ ఆర్టిస్ట్ శ్రీవాణి మాత్రం తనదైన స్టైల్లో నాటు నాటు టీంకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్చరణ్, ఎన్టీఆర్లు నాటు నాటు డాన్సుతో తెరపై దుమ్మురేపితే… శ్రీవాణి తన వీణపై అదరగొట్టారు. నాటు నాటు అంటూ తన వేళ్లతో వీణపై డాన్సు చేయించారు. చెప్పడం కంటే ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేస్తారు. వీణపై నాటు నాటు డాన్సు వీడియో చూడండి
వీణపై నాటు నాటు పాట డాన్సు