Varun Tej | గని సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే ఊహించా : వరుణ్ తేజ్
Gandeevadhari Arjuna Movie | వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో గని టాప్ ప్లేస్‌లో ఉంటుంది. గతేడాది సమ్మర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాములు డిజాస్టర్ కాలేదు. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేదని అప్పుడే ఓపెన్‌గా మాట్లాడేసుకున్నారు.
Gandeevadhari Arjuna Movie | వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో గని టాప్ ప్లేస్‌లో ఉంటుంది. గతేడాది సమ్మర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాములు డిజాస్టర్ కాలేదు. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేదని అప్పుడే ఓపెన్‌గా మాట్లాడేసుకున్నారు. ప్రత్యేకించి బాక్సింగ్ శిక్షణ తీసుకుని రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకుని కష్టపడిన గని తొలిరోజే మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుని ఫస్ట్ వీకెండ్‌కే దుకాణం సర్దేసింది. కిరణ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు బాబీ వేరే నిర్మాతతో కలిసి గ్రాండియర్ స్కేల్లో ఈ సినిమాను నిర్మించాడు. సునీల్ శెట్టి. ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ ఉండటతో రిలీజ్ ముంగిట ఈ సినిమాపై ఓ రేంజ్లో హైప్ ఏర్పడింది.
కానీ తీరా రిలీజయ్యాక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోర్లా పడిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా డిజాస్టర్ అవవ్వడానికి కారణాలేంటో వరుణ్ వెల్లడించాడు. గని సినిమా నా మొదటి ఫ్లాప్ కాదు. ఇంతకుముందు కూడా కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. మిస్టర్ సినిమా ఫ్లాప్ అయ్యాక తప్పెక్కడ జరిగిందో విశ్లేషించుకుని దాన్ని సవరించుకున్నా . ఆ తర్వాత నా నుంచి ఫిదా, తొలి ప్రేమ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. అలాగే గని విషయంలో కూడా తప్పెక్కడ జరిగిందో విశ్లేషించుకున్నా. గని ఒక స్పోర్స్ డ్రామా. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని ఓ కమర్షియల్ సినిమాగా దాన్ని మలిచాం. కాగా అక్కడే తేడా కొట్టేసింది. నిజానికి సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నపుడే గని ఫ్లాప్ అవుతుందని అనుకున్నాం. కానీ ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని చిన్న ఆశ ఉండేది. కానీ అలా ఏమీ జరగలేదంటూ గని ఫ్లాప్ గురించి వివరణ ఇచ్చాడు.
ప్రస్తుతం వరుణ్ నటించిన గాండీవధారి అర్జున్ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటే వరుణ్ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని పలువురు నెటీజన్లు తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

