ప్రపంచంలో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది మీరేనేమో : వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాలన్నా దాంట్లో కొంత కాంట్రవర్సి, సెటైర్స్ తప్పక మిక్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆర్జీవీ చేసే కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇటీవల ఆయన సుమంత్ పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. పవిత్ర అనే అమ్మాయితో వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నట్టు ,త్వరలో వీరి మ్యారేజ్ జరగబోతున్నట్టు ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? సుమంత్. నీ కర్మ, ఆ పవిత్ర కర్మ. అనుభవించండి` అని ట్వీట్ చేశారు వర్మ. పెళ్లి టాపిక్ వస్తే వెంటనే ట్వీట్స్ చేసే వర్మ తాజాగా జెనీలియా- రితేష్ దేశ్‌ముఖ్ అన్యోన్యతను చూసి అసూయ పడుతున్నట్టుగా కామెంట్ చేశాడు.
ఆగస్ట్ 5 జెనీలియా బర్త్ డే కాగా, ఈ సందర్భంగా భార్యపై ప్రేమను కురిపించారు రితేష్. తనతో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డేను చెప్పేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఆర్జీవీ.. ఈ ప్రపంచ వ్యాప్తంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న జంట మీది మాత్రమే కావొచ్చు అని చెప్పిన వర్మ.. జెనీలియాకు బర్త్ డే విషెస్ కూడా చెప్పేశారు.
కాగా, జెనీలియా టీవీ షోలో .. రితేష్ తన పాదాలను పెళ్లిలో 8 సార్లు పట్టుకున్నాడని చెప్పింది. రితేష్ కుటుంబం సంప్రదాయం ప్రకారు వరుడు వధువు కాళ్లను పట్టుకునే ఆచారంలో భాగంగా ఆయన అలా చేశాడు.
Wowweee u guys seem to be the one and only happily married couple in the whole wide world ! Happy birthday @geneliad 💐💐💐 https://t.co/6wONmyfX1u
— Ram Gopal Varma (@RGVzoomin) August 5, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

