Ranjithame Song Special Poster | ఈ ఏడాది ‘బీస్ట్’తో భారీ పరాజయం సాధించిన విజయ్.. ‘వారసుడు’ సినిమాతో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. కాగా విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారసుడు ఫస్ట్ సింగిల్ శనివారం సాయంత్రం రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం పాటకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
విజయ్, రష్మిక రొమాంటిక్ లుక్తో ఈ పోస్టర్ను చిత్రబృందం డిజైన్ చేశారు. ‘రంజితమే’ అంటూ సాగే ఈ పాట గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థమన్ సంగీతం అందించిన ఈ పాటను ఎమ్.ఎమ్ మానసితో కలిసి విజయ్ ఆలపించాడు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.