టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌కి రంగం సిద్ధమైంది. ‘ఉప్పెన’ఫేం వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్‌బస్టర్స్‌ని అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా రానున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. ఇటీవలే వైష్ణవ్‌కి శ్రీకాంత్ అడ్డాల కథ వినిపించారట.
తనదైన భావోద్వేగాలతో విభిన్నంగా సాగే ఈ ప్రేమకథ వైష్ణవ్ తేజ్‌కి బాగా నచ్చిందని వినికిడి. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? అనే విషయం తెలియాల్సివుంది. ఈ సినిమాకు చెందిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.