రంగరంగ వైభవంగా’ ట్రైలర్ టాక్.. మెగా అల్లుడు మళ్లీ కొట్టేలా ఉన్నాడుగా..!
Ranga Ranga Vaibhavanga Movie Trailer | గతేడాది ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు సంచలన ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన డెబ్యూ హీరోల లిస్టులో మెగా మేనల్లుడిని చేర్చింది. ముందు నుంచి ఈ కుర్రాడిపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు.. కానీ ఉప్పెన విజయంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు వైష్ణవ్ తేజ్. అయితే దీని తర్వాత వచ్చిన కొండ పొలం సినిమా అంచనాలు అందుకోలేదు. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా కనీసం వచ్చి వెళ్లినట్టు కూడా ఎవరికి తెలియదు.
తాజాగా రంగ రంగ వైభవంగా అంటూ మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు వైష్ణవ్. తమిళ దర్శకుడు గిరీషయ్య తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుంది. SVCC బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ దీన్ని మరింత రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూసినట్టుగానే ఈ సినిమా కథ ఉంది. హీరో హీరోయిన్లకు చిన్నప్పటి నుంచి పడదు.. చివరికి వాళ్లే ఒకరినొకరు ప్రేమించుకుంటారు.. పెద్దలను ఒప్పించి ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది ఈ సినిమా కథ. థీమ్ సింపుల్‌గానే ఉంది కానీ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది.
ఈ సినిమాతో హిట్టు కొట్టి టాలీవుడ్లో తన మార్కెట్ పక్కా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. అది జరగాలంటే రంగ రంగ వైభవంగా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. ఈమధ్య మీడియం రేంజ్ హీరోలకు విజయాలు బాగానే వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వైపు కదులుతున్నారు. మరి అంత దమ్మున్న కంటెంట్ రంగ రంగ వైభవంగా సినిమాలో ఉందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఈ సినిమాలో రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

