Vadala Movie Trailer | ‘వదల’ ట్రైలర్లో సైకలాజికల్ థ్రిల్.. జగపతిబాబు ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మిస్టరీ యువతి!
Vadala Movie Trailer | సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'వదల' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
Vadala Movie Trailer | సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదల’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ అత్యంత కీలక పాత్రలో కనిపించనున్నారు. కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ట్రైలర్‌ను గమనిస్తే, మొదట ఒక సాధారణ కుటుంబ కథలా సినిమా ప్రారంభమవుతుంది. ఇరవై ఏళ్లుగా సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్న దంపతులుగా జగపతిబాబు, లయ కనిపిస్తారు. ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ, ఆప్యాయతతో జీవిస్తున్న వారి జీవితంలోకి అనూహ్యంగా ఓ యువతి ప్రవేశించడం కథను పూర్తిగా మలుపుతిప్పుతుంది. పక్కింటికి వచ్చిన ఆ యువతి జగపతిబాబు పాత్రపై ప్రమాదకరమైన స్థాయిలో మోజు పెంచుకోవడం, క్రమంగా అది వ్యామోహంగా మారడం ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. అదే సమయంలో లయ పాత్రకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం, కుటుంబంపై ముప్పు పెరగడం కథలోని సస్పెన్స్‌ను మరింత పెంచుతోంది.
ఈ చిత్రంలో కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే వ్యక్తిగా జగపతిబాబు కనిపిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, అనుకోని ప్రమాదం మధ్య చిక్కుకున్న వ్యక్తి పాత్రలో ఆయన నటన ట్రైలర్లోనే ఆకట్టుకుంటోంది.లయ కూడా సహజమైన నటనతో కుటుంబ భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. మరోవైపు హృతిక శ్రీనివాస్ పోషించిన పాత్ర ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె హావభావాలు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ మరోసారి థ్రిల్లర్ జానర్‌పై తన పట్టు చూపించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కథలో ఎక్కడా సస్పెన్స్ తగ్గకుండా, అదే సమయంలో కుటుంబ భావోద్వేగాలను కూడా సమతుల్యంగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఆ యువతి అసలు ఉద్దేశం ఏమిటి? ఆమె జగపతిబాబు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఈ సంఘటనల వెనుక అసలు నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తిని ట్రైలర్ చివరి వరకు కొనసాగిస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన విజువల్స్ థ్రిల్లర్ మూడ్‌ను మరింత బలపరిచాయి. డార్క్ టోన్స్, విజువల్ ఫ్రేమింగ్ కథలోని ఉత్కంఠను పెంచేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు కార్తీక్ కోడకండ్ల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి అదనపు థ్రిల్‌ను జోడించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

