తెలుగు సినీ కార్మికులకు టీకా డ్రైవ్ ప్రారంభం

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులందరికీ కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 24 క్రాఫ్ట్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లతో పాటు ఫిల్మ్ జర్నలిస్టులందరికి కరోనా క్రైసిస్ ఛారిటీ కింద టీకాలు వేయనున్నట్లు చిరంజీవి తెలిపారు. అపోలో 24 | 7 సహకారంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఈ టీకా డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
వాస్తవానికి ఈ టీకా డ్రైవ్ మూడు వారాల క్రితమే ప్రారంభమైనప్పటికీ టీకా షాట్ల కొరత కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిరంజీవి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం వేలాది మంది తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులు నమోదు చేసుకున్నారన్నారు. ప్రతిరోజూ 500 మంది సినీ కార్మికులను టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ్, ఎన్ శంకర్, మెహర్ రమేష్, కె ఎల్ దామోదర్ ప్రసాద్, సి. కళ్యాణ్, బెనర్జీ, సురేష్ వంటి పరిశ్రమ ప్రముఖులు సినీ కార్మికులకు సహాయం చేసేందుకు ఛారిటీకి తమ వంతు సహకారం అందించినట్లు మెగాస్టార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో సినీ కార్మికులకు అవసరమైన నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. ఈ టీకా డ్రైవ్ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్, తెలుగు ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

