Bhagwant kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కా తెలంగాణ యాస, భాషలో అలరించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, టీజర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన గణేశ్ ఆంథెమ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా సెకండ్ సింగిల్ ఉయ్యాలో ఉయ్యాలా (Uyyaalo Uyyaala Song)ను విడుదల చేశారు మేకర్స్.
ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా.. అవుమల్లా అవుమల్లా గీ చేతుల్ల నిను మొయ్యాలా.. అంటూ తెలంగాణ ఫ్లేవర్‌తో బాలకృష్ణ, శ్రీలీల మధ్య సాగుతున్న పాట అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ పాడారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పెండ్లి సందD ఫేం శ్రీలీల కీ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో తెలంగాణ యాసలో ఊరమాస్ డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు బాలకృష్ణ.
భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఓవర్సీస్లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. అక్టోబర్ 18న యూఎస్ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉండబోతున్నాయని ఇప్పటికే మేకర్స్ స్పెషల్ వీడియో షేర్ చేశారని తెలిసిందే.
బాలకృష్ణ ఈ సారి భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్..
ఉయ్యాలో ఉయ్యాలా ..
నా ఊపిరె నీకు ఉయ్యాల❤️#BhagavanthKesari 2nd single #UyyaaloUyyaala out now ❤️🔥 https://t.co/vqGsE4PpZOIn Cinemas- Oct 19th🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @MusicThaman @charanproducer @IananthaSriram @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/issTEJ2c04
— sreeleela (@sreeleela14) October 4, 2023
గణేశ్ ఆంథెమ్..
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023
భగవంత్ కేసరి టీజర్..