13 హారర్ సినిమాలు చూసి.. రూ.95 వేలు గెలుచుకోండి

న్యూయార్క్: హారర్ మూవీలు చూస్తారా ? అయితే మీకో టెస్ట్. హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు.. మీ గుండె ఎలా కొట్టుకుంటుంది ? హార్ట్ బీటింగ్ రేట్‌ను తెలుసుకునేందుకు ఓ అమెరికా కంపెనీ టెస్ట్ పెట్టింది. అయితే మొత్తం 13 హారర్ సినిమాలు చూస్తే, వారికి ఇండియన్ కరెన్సీలో రూ.95 వేలు (1300 డాలర్లు) చెల్లించనున్నారు. ఈ 13 సినిమాలను అక్టోబర్‌లోనే చూసేయాలి. ఫిట్‌బిట్ అనే పరికరాన్ని ధరించి.. హారర్ సినిమాలను చూడాల్సి ఉంటుంది. దీని వల్ల హార్ట్ రేట్‌ను పరీక్షించనున్నారు. భారీ బడ్జెట్ పెట్టి హారర్ మూవీలు తీస్తుంటే, అది ఎంత వరకు ప్రేక్షకుడిపై ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఆ కంపెనీ ఈ పరీక్ష పెట్టనున్నది. భారీ బడ్జెట్‌తో తీసే హారర్ మూవీలు ప్రేక్షకులను ఎక్కువగా భయపెడుతాయా లేదా అని టెస్ట్ చేయనున్నారు.
ఫిట్బిట్లో పాల్గొన్న వారు చూడాల్సిన 13 హారర్ చిత్రాల జాబితా రిలీజ్ చేశారు. సా, అమిటీవిల్లే హారర్, ఎ క్వైట్ ప్లేస్, ఎ క్వైట్ ప్లేస్ పార్ట్ 2, క్యాండీమ్యాన్, ఇన్సిడియస్, ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సినిస్టర్, గెట్ ఔట్, ద పర్జ్, హాలోవీన్, పారానార్మల్ యాక్టివిటీలు, అన్నాబెలీ సినిమాలు ఉన్నాయి. ఫిట్‌బిట్ హార్ట్ రేట్ టెస్టులో పాల్గొనేవాళ్లు సెప్టెంబర్ 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక చేసిన వారి జాబితాను అక్టోబర్ 1న రిలీజ్ చేస్తారు. వాళ్లందరికీ ఆ నెల 4వ తేదీ లోగా ఫిట్‌బిట్ పరికరం అందుతుంది. ఇక అక్టోబర్ 9 నుంచి 18 వరకు 13 హారర్ చిత్రాలను చూడాలి. దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండి ఉండాలి. కేవలం అమెరికన్లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

