Unstoppable 2 | అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్.. అన్‌స్టాపబుల్ 2లో గోపీచంద్ మలినేని.. ప్రోమో
బాలకృష్ణ (Balakrishna) సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజాతో అభిమానులను అలరించేందుకు రెడీ అంటున్నాడు. సంక్రాంతికి ముందే అన్‌స్టాపబుల్ 2 (Unstoppable 2 With NBK) ఎపిసోడ్ 8 ప్రోమో వదిలాడు. తాజా ఎపిసోడ్లో వీరసింహారెడ్డి టీంతో మాస్ జాతర ఉండబోతుందని ఆహా టీం తెలిపింది.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజాతో అభిమానులను అలరించేందుకు రెడీ అంటున్నాడు. బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12న గ్రాండ్‌గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం సంక్రాంతికి ముందే అన్‌స్టాపబుల్ 2 (Unstoppable 2 With NBK) ఎపిసోడ్ 8 ప్రోమో వదిలాడు.
తాజా ఎపిసోడ్లో వీరసింహారెడ్డి టీంతో మాస్ జాతర ఉండబోతుందని ఆహా టీం తెలిపింది. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, దునియా విజయ్, గోపీచంద్ మలినేనితోపాటు మైత్రీ మూవీ మేకర్స్ తో సరదా చిట్ చాట్ చేశాడు బాలకృష్ణ. ఇంటర్వెల్ బ్లాక్‌ను మీరు ఎప్పుడైతే ఓకే చేశారో.. అప్పడే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నాడు గోపీచంద్ మలినేని.
క్రాక్ సినిమాకు ముందు ఏడాదిన్నర ఇబ్బందులు పడ్డావ్. నీ ప్రాపర్టీ కూడా అమ్మేశావ్. ఆ టైంలో నీకెలా అనిపించింది.. అని బాలకృష్ణ అడిగాడు. దానికి గోపీచంద్ మలినేని సమాధానం చెప్పే క్రమంలో బావోద్వేగానికి లోనవుతుండగా.. పక్కనే ఉన్న వరలక్ష్మి శరత్‌కుమార్ అతని భుజం తట్టి ఓదారుస్తోంది. గోపీచంద్ మలినేని ఆ టైంలో ఇంతకీ ఎలాంటి ఇబ్బందులెదుర్కొన్నాడనేది ఫుల్ ఎపిసోడ్లో తెలియనుంది.
అన్‌స్టాపబుల్ 2 సంక్రాంతి స్పెషల్ ప్రోమో ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

