Salaar | నో రిలాక్స్ అంటోన్న ప్రభాస్ టీం.. సలార్ మేకర్స్ యూనిక్ ప్రమోషనల్ ప్లాన్
Salaar | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న మూవీ సలార్ (Salaar). కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్న సలార్ రెండుపార్టులుగా రాబోతుండగా.. Salaar Part-1 Ceasefireను డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Salaar | టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో టాప్‌లో ఉంటుంది సలార్ (Salaar). ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో గూస్బంప్స్ తెప్పించే విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్న సలార్ రెండుపార్టులుగా రాబోతుండగా.. Salaar Part-1 Ceasefireను డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే సలార్ ప్రమోషన్స్‌కు సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ టీం సలార్ ప్రమోషన్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు రెడీ అవుతోందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ టీం మెంబర్స్ యూనిక్ ప్రమోషనల్ క్యాంపెయిన్స్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను కూడా చాలా ప్రత్యేకంగా నిలిచిపోయేలా నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో షారుఖ్‌ఖాన్ నటిస్తోన్న ఢంకీ కూడా సలార్‌తోపాటు డిసెంబర్ 22న విడుదల కానున్న నేపథ్యంలో ఏ మాత్రం రిలాక్స్ అవ్వకుండా.. భారీ ఓపెనింగ్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రమోషన్స్ చేపట్టాలని సలార్ టీం నిర్ణయించుకుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
సలార్ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్నాడు. సలార్‌లో పృథ్విరాజ్ సుకుమార్ పోషిస్తున్న వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. నుదుటన తిలకం, మెడ చుట్టూ స్కార్ప్ వేసుకొని స్టన్నింగ్ లుక్‌తో వరదరాజ మన్నార్‌గా అదిరిపోయే లుక్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న సలార్ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్న సలార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సలార్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

