Ugram Movie | గూస్బంప్స్ తెప్పిస్తున్న ఉగ్రం టైటిల్ సాంగ్ రిలీజ్
Ugram Movie Songs | నరేష్‌కు కమర్షియల్గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్ పెరిగింది. ఇక విజయ్ కనకమేడల దర్శకుడిగా తొలి అడుగులోనే తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఉగ్రం అనే థ్రిల్లర్ సినిమా కోసం చేతులు కలిపారు.
Ugram Movie Songs | చాలా కాలం తర్వాత ‘నాంది’తో అల్లరి నరేష్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడమే కాదు తనలోని కొత్త నటుడుని పరిచయం చేశాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్ పెరిగింది. ఇక విజయ్ కనకమేడల దర్శకుడిగా తొలి అడుగులోనే తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఉగ్రం అనే థ్రిల్లర్ సినిమా కోసం చేతులు కలిపారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఉగ్రం ఉగ్రం అంటూ సాగే ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొరుచుకుంటున్నాయి. శ్రీచరణ్ పాకాల ట్యూన్ వేరే లెవల్లో ఉంది. అంతే స్థాయిలో పాటను కూడా తనే స్వయంగా ఆలపించాడు. చైతన్య ప్రసాద్ సాహిత్యం ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లను చూస్తుంటే నాందికి మించిన బ్లాక్‌బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మిస్తున్నారు. నరేష్‌కు జోడీగా మిర్నా మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పాకాలా సంగీతం అందించిన ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

