విజయ్ సేతుపతి కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘విడుతలై’. ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మొదటి భాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో విభిన్న కథాంశంతో రూపొందిస్తున్నాం. ప్రస్తుతం కొడైకనాల్‌లో పీటర్ హెయిన్ నేతృత్వంలో పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో బల్గేరియాకు చెందిన నిపుణులు పాల్గొంటున్నారు.
విజయ్ సేతుపతి ఇప్పటివరకు పోషించని సరికొత్త పాత్రలో కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. భవానిశ్రీ, ప్రకాష్‌రాజ్, గౌతమ్‌వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వెల్రాజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తమిళ, తెలుగు భాషల్లో అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.