శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీ జ నిర్మిస్తున్నారు. వంశీధర్ గౌడ్-లక్ష్మీ నారాయణ దర్శకులు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. ‘2001 లో పవన్‌కల్యాణ్ ‘ఖుషి’ సినిమా విడుదలైన సమయంలో జరిగే కథ ఇది.
తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఆకట్టుకోవడానికి సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షో టిక్కెట్లను సంపాదించే క్రమంలో హీరో పడే ఇబ్బందుల నేపథ్యంలో కథ నడుస్తుంది’ అని దర్శకులు తెలిపారు. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, మహేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అనుదీప్ కేవీ, స్క్రీన్‌ప్లే: అనుదీప్ కెవీ, వంశీధర్‌గౌడ్, సంగీతం: రాధన్, సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి, సమర్పణ: ఏడిద శ్రీరామ్, దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ.పి.