Toxic | ‘టాక్సిక్’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది పెద్దల కోసం రూపొందించిన ప్రత్యేక చిత్రం ..
Toxic | కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాక్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Toxic | కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాక్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్, ప్రోమో వీడియోలు, పాటల్లో కనిపించిన బోల్డ్ కంటెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కె. వెంకట నారాయణ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాక్సిక్ సాధారణ కమర్షియల్ సినిమా కాదని, తాము ఇప్పటివరకు నిర్మించిన చిత్రాల కంటే పూర్తిగా భిన్నమైన కథాంశంతో రూపొందించామని ఆయన తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూసిన తర్వాత తప్పకుండా కొత్త అనుభూతిని పొందుతారని, సినిమా ముగిసిన తర్వాత చిత్ర బృందాన్ని అభినందిస్తారనే పూర్తి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘టాక్సిక్’ ఒక కల్పిత కథ ఆధారంగా రూపొందిన సినిమా అని, ముఖ్యంగా పెద్దల కోసం రూపొందించిన ప్రత్యేక కథనమని ఆయన స్పష్టం చేశారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ఇందులో భావోద్వేగాలు, యాక్షన్, రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు.
ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ‘మనసాగదే’ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. యశ్, తారా సుతారియా మధ్య సాగే ఈ రొమాంటిక్ ట్రాక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా పాటలోని విజువల్స్, సంగీతం, ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ పాటపై హీరోయిన్ తారా సుతారియా కూడా స్పందించారు. పాటలోని కొన్ని సన్నివేశాలను ఎంతో అందంగా చిత్రీకరించారని, చిత్రబృందం విజువల్‌గా అద్భుతమైన అనుభూతిని అందించిందని ఆమె సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. దీంతో ఈ పాటకు మరింత క్రేజ్ ఏర్పడింది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- geetu mohandas
- kgf
- look
- Producer
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

