Nadigar Thilakam | చిక్కుల్లో టోవినో థామస్ ‘నడిగర్ తిలకం’.. టైటిల్ మార్చాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
Nadigar Thilakam | మిన్నల్ మురళీ (Minnal Murali) సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించాడు మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas). అప్పటి నుండి ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆధరిస్తున్నారు.
Nadigar Thilakam | మిన్నల్ మురళీ (Minnal Murali) సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించాడు మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas). అప్పటి నుండి ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆధరిస్తున్నారు. ఇటీవలే రిలీజైన 2018 సినిమా కూడా తెలుగులో భీభత్సమైన కలెక్షన్లు సాధించి.. టోవినో థామస్కు మంచి మార్కెట్కు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే.. టోవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘నడిగర్ తిలకం’ (Nadigar Thilakam). ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఫేమ్ జీన్ పాల్ లాల్(Jean Paul Lal) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సౌబిన్ షాహిర్(Shoubin Shaeer) కథనాయికగా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.
దివంగత తమిళ నటుడు శివాజీ గణేషన్ అభిమానుల సంఘం ఈ సినిమా టైటిల్ని మార్చాలని చిత్ర బృందాన్ని డిమాండ్ చేస్తుంది. తమిళ సినీ నటుడు, నిర్మాత శివాజీ గణేశన్(Shivaji Ganeshan)ను ‘నడికర్ తిలకం'(Nadigar Thilagam) అని కూడా పిలుస్తారు. అయితే సినిమా టైటిల్ను ‘నడిగర్ తిలకం’ (Nadigar Thilakam) అని పెట్టడం వలన శివాజీ గణేషన్ అభిమానులు టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. నడికర్ తిలకం అనేది శివాజీ గణేషన్ బయోపిక్ సినిమాకు మాత్రమే పెట్టాలని మిగతా ఏ సినిమాలకు ఈ టైటిల్ వాడొద్దంటూ శివాజీ గణేషన్ అభిమానుల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రలో టోవినో థామస్ కనిపించనున్నారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

