Lal Singh Chaddha Movie | ‘లాల్ సింగ్ చడ్డా’ కోసం నాగచైతన్య అన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడా?
Naga Chaitanya Remuneration For Lal Singh Chaddha | అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ దూసుకుపొతున్నాడు. ‘లవ్‌స్టోరి’, ‘బంగార్రాజు’ వంటి రెండు వరుస విజయాలతో టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఇటీవలే విడుదలైన ‘థాంక్యూ’ చిత్రం ఈయన స్పీడ్‌కు బ్రేకులు వేసింది. భారీ అంచనాల నడుమ జూలై 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం నాగచైతన్య ఆశలన్ని ‘లాల్ సింగ్ చడ్డా’ పైనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంలో నాగచైతన్య రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘లాల్ సింగ్ చడ్డా’లో నాగచైతన్య ‘బాలరాజు’ అనే ఆర్మీ అధికారిగా నటించాడు. అమీర్‌ఖాన్ ఫ్రెండ్‌గా ఈ చిత్రంలో చైతన్య కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ సినిమాకి నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉంటాడు అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. చైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 నుండి 8 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు టాక్. అయితే లాల్ సింగ్ చడ్డాలో నటించినందుకు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. కీలకపాత్ర కోసం ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే విశేషం అనే చెప్పాలి. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తే బాలీవుడ్లో నాగచైతన్యకు భారీగా అవకాశాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ధూత అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. అమెజాన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. దీని తర్వాత మానాడు ఫేం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. వీటితో పాటుగా పరుశురాం దర్వకత్వంలో లవ్ యాక్షన్ సినిమాను చేయబోతున్నట్లు టాక్. ఈ చిత్రంతో రష్మిక హీరోయిన్గా నటించనుందట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

